Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి, 2013 భూసే కరణ చట్టం ప్రకారం ఆర్.ఆర్. పరిహారం అందించాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణా న్ని నిలిపివేయాలని సాగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 34వ రోజుకు చేరుకున్నాయి. పాశికంటి నాగ మురళి ఆధ్వర్యంలో 10వ వార్డు నుండి ఈ దీక్షలో వేటకాని నరసమ్మ, బండ్ల రామలక్ష్మి, పోతనబొయిన పద్మ, వీర్ల కాంతమ్మ, అడప నాగయ్య, కొమరగిరి తులసమ్మ, బొడ్డు సమ్మక్క, కొండా పద్మ, గోనెల రాజేశ్వరి, నీరుడు రమణ, కూరపా టి సారమ్మ, నీరుడు ప్రశాంత్, కొండా రాధమ్మ తదిత రులు కూర్చున్నారు. ఈ దీక్షలకు మద్దతుగా రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి, సామాజిక వేత్త నారపోగు శ్రీను, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాశికంటి నాగ మురళి, జక్కం శ్రీనివాసరావు, పొల్కొండ ప్రభాకర్, పిల్లల మర్రి దామోదర్, పంచా యతీ ఉద్యోగస్తులు బాబు, కన్నెపల్లి రాఘవరావు , లక్ష్మణ్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించారు.