Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బంది పడుతున్న ప్రజలు
- కాలనీ సమస్యలు పరిష్కరించాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-భద్రాచలం
డ్రైనేజీ సమస్యతో జగదీష్ కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని, స్థానిక అధికారులు సర్వే నిర్వహించి వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం ఈఓ వెంకటేశ్వర్లుకి వినతి పత్రం అందిచారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నార్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడారు. జగదీష్ కాలనీలోని చివరి వీధిలో ఉన్న డ్రైనేజీని స్థానికంగా ఉన్న ఒక ఇంటి యజమాని అక్రమంగా పూడ్చి తన భవన నిర్మాణం చేపట్టగా అక్కడ ఉన్న ప్రజలు ఆ డ్రైన్ పూడ్చవద్దు మట్టి తీయమని అడగగా నేను తీయని ఏమి చేసుకుంటారో చేసుకోండి అని చెప్పగా స్థానిక అధికారులకు విన్నవించగా ఆ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు అని స్థానికులు వివరించారు. కానీ అక్కడ పక్కా డ్రైనేజీ లేకపోవడం వలన పైన ఉన్నటువంటి చెరువులోని ఊట నీరు కూడా కాలనీలోని గృహాలు లోకి వస్తూ గృహాలు నిండిపోతున్నాయని, కావున అక్కడ పక్కా డ్రైనేజీ నిర్మించాలని స్థానిక కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి గ్రామపంచాయతీ ఈవోకి విన్నవించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యురాలు డి.లక్ష్మి, శాఖా కార్యదర్శి రామకృష్ణ, మోహన్ రావు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.