Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేకు వినతి పత్రం
నవతెలంగాణ-సుజాతనగర్
తెలంగాణ ప్రభుత్వం గొల్ల కుర్మలకు పంపిణీ చేస్తున్న గొర్రెలకు బదులు నగదు బదిలీ చేయాలని జీఎంపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బచ్చలికూర శ్రీను అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడవ విడతలో ఇచ్చే వారికి నగదు ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన గొర్రెల కాపరులకు పింఛన్ మంజూరు చేయాలని ప్రమాదవశాత్తు మరణించిన కాపరులకు ఎక్స్ గ్రేషియా చెల్లించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని అన్నారుజ ఈ కార్యక్రమంలో వీర్ల రమేష్, కొంపెల్లి ఐలయ్య, వీర సత్యం తదితరులు పాల్గొన్నారు.