Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్గా ఎం.వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. మెజిస్ట్రేట్ వెంకటేశ్వర్లుకి మణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.విజయ రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బార్ అండ్ బెంచ్ సంబంధాలను పరస్పరం సహకారాలు అందించుకునేలా ఉండాలన్నారు. త్వరితగతిన కేసులను పరిష్కరించే విషయంలో న్యాయవాదులు సహకరించాలన్నారు. ఈ సందర్బంగా సీఐ ముత్యం రమేష్, పురుషోత్తం, రాజకుమార్, ఎక్సైజ్ రామ్మూర్తి, ఫారెస్ట్ అధికారులు మర్యాద పూర్వకంగా మెజిస్ట్రేటును కలిశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చిర్ర రవికుమార్, రామ్మోహన్ రావు, కందిమల్ల నరసింహారావు, శైలజ, జాడి చుక్కయ్య, నగేష్ కుమార్, కవిత, భాస్కర్, సరస్వతి, సావిత్రి, సంధ్య, వాసవి పాల్గొన్నారు.