Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాస్పిరేషన్ ప్రభరీ అధికారి యువరాజు
నవతెలంగాణ-కొత్తగూడెం
వ్వవసాయ రంగానికి నీటి తోడకాలను తగ్గించి వర్షపు నీటి ద్వారా లభించే నీటిని సద్వినియోగం చేసుకోవడం, వినియోగించు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని యాస్పిరేషన్ ప్రభరీ అధికారి యువరాజు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో కలెక్టర్ అధ్యక్షతన డీఆర్డిఓ, పంచాయతీరాజ్, విద్యా, మిషన్ బగీరథ, ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన, మున్సిపల్, జలశక్తి అభియాన్-క్యాచ్ ది రైన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వర్షపునీటి సంరక్షణపై చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వ సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. వర్షపునీటి 'సంరక్షణకు వెంచర్లులో నిర్మాణానికి అనుమతులు మంజూరులో ఇంకుడు గుంతల నిర్మాణం తప్పని సరి చేయాలని చెప్పారు. వర్షపు నీటి సంరక్షణకు సమాలోచనలు చేయాలని ఆయన వివరించారు.
ఇంకుడు గుంతల నిర్మించాం : కలెక్టర్
రూఫ్ వాటర్ని వడిసి పట్టి భూ గర్భజలాలాను పెంపొందించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టినట్లు కలెక్టర్ అనుదీప్ చెప్పారు. రూఫ్ వాటర్ని వడిసిపట్టేందుకు 15 శాఖల్లో 513 నిర్మాణాలు చేపట్టినట్లు ఆయన వివరించారు. అనంత రం అమృత్ సరోవర్లో చేపట్టిన చెరువుల అభివృద్ధిని పవర్పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ మధుసూదన్ రాజు, జడ్పీ సిఈఓ మెరుగు విద్యాలత, డిపిఓ రమాకాంత్, పిఆర్ ఈఈ సుధాకర్, ఇరిగేషన్ అధికారి అర్జున్, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, డిఈఓ సోమశేఖరశర్మ, భూగర్భ జల అధికారి బాలు, ఏపిడి సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్లు నవీస్, శ్రీకాంత్, అంకుషావలీ, మాధవి తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టులకు సహకరించవద్దు : డీఎస్పీ
నవతెలంగాణ-ఆళ్ళపల్లి (గుండాల)
మండలంలోని ప్రజలెవరూ మావోయిస్టులకు సహకరించొద్దని ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి అన్నారు. ఈ మేరకు శుక్రవారం గుండాల మండల పరిధిలోని ముత్తాపురం గ్రామంలో ప్రజలతో ఆయన మాట్లాడారు. గ్రామ సమస్యలను పోలీసులకు తెలియపరచాలని, వాటిని సాధ్యమైనంత మేరకు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు తెలియపరచాలని అన్నారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుండాల సీఐ కరుణాకర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.