Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పొదెం వీరయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం మండలానికి సరిపడా బతుకమ్మ చీరలు రాకపోవడాన్ని చూస్తే తెలంగాణ ఆడబిడ్డలకు మొక్కుబడిగా బతుకమ్మ చీరల పంపిణీ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు దీనిని బట్టి అర్థం అవుతుందని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆరోపించారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం దుమ్ముగూడెం మండలానికి 11,700 చీరలు రావాల్సి ఉండగా కేవలం 6000 చీరలు రావడం వంటి పరిణామాల చూస్తే అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు అర్థం అవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీపీ రేసు లక్ష్మి, జెడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఆర్ఐలు ఆదినారాయణ, లక్ష్మయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాస్ రావు, సీనియర్ నాయకులు దర్శి సాంబశివరావు, తెల్లం నరేష్, ఉబ్బ వేణు, వేమన రెడ్డి లంక శివ తదితరులు పాల్గొన్నారు.