Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మల్లారం రోడ్డులో గల ఎస్సీ, బీసీ హాస్టల్ పక్కన ఉన్న మూడు బెల్టు షాపులను అక్కడి నుంచి తరలించాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ స్వామి, ఏఎస్ఐ ప్రతాపరెడ్డి, అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణకి, అశ్వరావుపేట ఎక్స్చేంజ్ సీఐకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి బత్తుల సాయి, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుంకు పాక ధర్మ మాట్లాడారు. మల్లారం రోడ్లో గల ఎస్సీ, బీసీ హాస్టల్ పక్కన ప్రభుత్వ భూమిలో మూడు షెడ్లు నిర్మించి బెల్టు షాప్ మధ్యం విక్రయిస్తున్నారని, మల్లారం కాలనీలోకి వెళ్లే మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదేవిధంగా హాస్టల్ విద్యార్ధులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, శివన్నారాయణ, నల్లబోతుల నాగార్జున, బెజవాడ రాము, ఎస్.కే బాజీ తదితరులు పాల్గొన్నారు.