Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం
నవతెలంగాణ-కొత్తగూడెం
హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని, సమస్యల పరిష్కారానికి జరుగుతున్న నిరవధిక సమ్మెను పరిష్కరించేదిశగా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగినది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. శనివారం సింగరేణి చైర్మెన్ ఎన్. శ్రీధర్‌కి వినతిపత్రం ఇవ్వాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే సింగరేణిలో జరుగుతున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికుల పోరాటంలో ప్రత్యక్ష భాగస్వామి కావాలని నిర్ణయించుకున్నారు.