Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం మన ఊరు - మనబడి కార్యక్రమంలో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి నిర్మిస్తున్న పాఠశాల గదులను ఎంపీపీ దేవరకొండ శిరీష, గ్రామ పంచాయతీ సర్పంచ్ వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. రాజుల దేవరపాడు గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు నిర్మాణంలో ఉన్నటు వంటి పాఠశాల తరగతి గదులను, వంటగదిని, పరిశీలించారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలను డిప్యూటీషన్పై మధిర ఎందుకు పంపించారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు చదువుకుంటున్నారో విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనంను పరిశీలించారు. గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి కేంద్రంలో ఎంతమంది చిన్నారులు ఉన్నారో తెలుసుకున్నారు. మామునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగదీష్‌కి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం భోజనాన్ని అందిం చాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ వెంకటనారాయణ, మాజీ సర్పంచ్ బండారు నరసింహారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుద్దుకూరు లింగయ్య, ఉపాధ్యాయులు బద్రు, నరసింహారావు, రమాదేవి, సునీత, చావా సతీష్, జమలయ్య, శ్రీనివాసరావు, అంగన్వాడీ టీచర్స్ విజయ కుమారి, నాగమణి, ఏఎన్ఎం రాణి, ఆశావర్కర్ ఉషరాణి తదితరులు పాల్గొన్నారు.