Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
నవతెలంగాణ - బోనకల్
తెలుగు ప్రజల సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక నందు దసరా పండుగ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఎంపీపీ కంకణాల సౌభాగ్యంతో కలిసి శుక్రవారం పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 47 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ రావూరి రాధిక, ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గుగులోతు రమేష్, సర్పంచులు కొమ్మినేని ఉపేందర్, జెర్రిపోతుల రవీందర్, తొండపు వేణు, ఎంపీటీసీలు కోటపర్తి హైమావతి, ముక్కపాటి అప్పారావు, కందిమల్ల రాధ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మండల ప్రధాన కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, రైతు బంధు మండల కన్వీనర్ వేమూరి ప్రసాదరావు, మాజీ జెడ్పిటిసి బనావత్ కొండ తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : తెరాస ప్రభుత్వ హయాంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ, ఆడపడుచులకు సారేగా బతుకమ్మ చీరలను అందిస్తున్నామని జడ్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. ముదిగొండ రైతువేదిక యందు శుక్రవారం ఎమ్మెల్సీ తాత మధుసూదనతో కలిసి ఆయన బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, డిప్యూటీ తాసిల్దార్ తాళ్లూరి దామోదర్, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, జడ్పిటిసి పసుపులేటి దుర్గ, ముదిగొండ, వెంకటాపురం గ్రామసర్పంచ్లు మందరపు లక్ష్మీ వెంకన్న, కోటి అనంతరాములు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పోట్ల ప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, ఆర్ఐలు బందెల ఉషారాణి, ఎస్.కె వహీదా, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీగడ శ్రీనివాస్ యాదవ్, పచ్చా సీతారామయ్య పాల్గొన్నారు.
చింతకాని : శాంతి సామరస్యానికి, పరమత సహనానికి మహిళలు అందరూ కలిసి జరుపుకునే పండుగ బతుకమ్మ. ఈ పండుగ ద్వారా తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఆడపడుచులకు చీరల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. చింతకాని మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ ఆడ బిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపిపి కోపూరి పూర్ణయ్య ,వైస్ ఎంపిపి గురిజాల హనుమంతరావు, చింతకాని సర్పంచ్ బండి సుభద్ర, తహసిల్దార్ మంగిలాల్, ఎంపిడివో శ్రీనివాసరావు,ఎంపీవో మల్లెల రవీంద్ర ప్రసాద్, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యులు మంకెన రమేష్, మండల కన్వీనర్ కిలారు మనోహర్ బాబు, నాగులవంచ సహకార సంఘం చైర్మన్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.