Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
- ఐసీడీఎస్ పథకాన్ని ఎత్తివేసే కుట్రను అడ్డుకుంటాం
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ
- ఘనంగా ప్రారంభమైన అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా 3 మహసభ
నవతెలంగాణ-పాల్వంచ
ప్రభుత్వ పథకాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయివేటు వారికి అప్పగించే ప్రయత్నాలు చేస్తుందని దీన్ని సహించేదిలేదని, కేంద్ర ప్రభుత్వం కార్మికులందరికీ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఐసీడీఎస్ పథకాన్ని ఎత్తివేసే కుట్రను అడ్డుకుంటామని, అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ అన్నారు. శుక్రవారం పాల్వంచలో అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియూ) జిల్లా 3 మహసభ ఘనంగా ప్రారంభమైంది. మహాసభ ప్రారంభ సూచికగా సీనియర్ నాయకులు శకుంతల జెండా ఆవిష్కరించారు. అమరులైన కార్మికులకు, రైతాంగానికి యూనియన్ సీనియర్ నాయకులు మాధవి లత సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సభ రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఈసం వెంకటమ్మ, విజయశీల, భానుశ్రీ అధ్యక్షత జరిగిన సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ మాట్లాడారు. ఐసీడీఎస్‌కి బడ్జెట్ తగ్గించి, క్రమక్రమంగా ఐసీడీఎస్ పథకాన్ని ఎత్తివేత కుట్రలకు నిరసనగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. కేంద్ర బిజేపీ ప్రభుత్వం ప్రభుత్వ పథకాలను ప్రవేట్ వ్యక్తులకు, సంస్థలకు అప్పగించి, బాధ్యత నుండి తప్పుకుంటుందన్నారు. దీని వలన ఈ పథకాల్లో పని చేస్తున్న కార్మికులకు మాత్రమే కాక, లబ్ధిదారులకు కూడా తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉన్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులందరికీ కనీస వేతనం రూ.26 వేల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు నిర్వహిస్తుంటే ప్రధాన మంత్రి మోడీ రోజుకు రూ.175లు ఉంటే చాలని చెప్పడం సరికాదన్నారు. రూ.175లతో బతకడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి జిలకర పద్మ మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ రంగంలో స్థానిక సమస్యలుపై ఫలితం తేలే వరకు దశల వారీ పోరాటాలు నిర్వహించామని, ప్రభుత్వ కుట్రలను కార్మి కులకు వివరించామన్నారు. కార్యదర్శి నివేదిక పద్మ ప్రవేశ పెట్టగా ప్రాజెక్ట్‌ల వారీగా ప్రతినిధులు చర్చలు చేశారు.
ప్రభుత్వ స్కీమ్‌లను కాపాడుకోవాలి : ఏజే రమేష్
కేంద్ర బీజేపీ కార్మిక వ్యతిరేఖ నిర్ణయాలను, మతోన్మాద ప్రమాదాన్ని విస్తృతంగా కార్మికుల్లోఎండగట్టి, ప్రభుత్వ స్కీమ్‌లను కాపాడుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్ అన్నారు. పాల్వంచ పట్టణంలో కామ్రేడ్ రాజేశ్వరి నగర్, నిట్టా పద్మ ప్రాంగణంలో వెంకటమ్మ, విజయశీల, భానుశ్రీ అధ్యక్ష వర్గంగా జరిగిన మహాసభలో ఏజె.రమేష్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే చర్యలను తీసుకుంటున్న దని, 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తెచ్చారన్నారు. ప్రభుత్వ విధానాల్లో ఉన్న నష్టాలను.మూలాలను కార్మిక వర్గం అర్థం చేసుకొని పాలకవర్గాలకు వ్యతిరేకంగా రాజకీయ చైతన్యాన్ని పెంపొందించు కోవాలన్నారు. ఈ మహాసభలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు యం.వి.అప్పారావు, కార్యదర్శి ఏజె.రమేష్, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా రవి కుమార్, డి.వీరన్న, భూక్యా రమేష్, అంగన్వాడీ యూనియన్ నాయకులు పాయం రాధా కుమారి, రాధ, రమ్య, సావిత్రి, సూరమ్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.