Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
పేద కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ఆర్ధిక ఇబ్బందులు రాకుండా ఆదుకుంటున్నారని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం సమితిసింగారం పంచాయతీ పరిధిలోని పద్మశాలీ భవనంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 74 మంది లబ్ధిదారులకు రూ.74 లక్షల విలువగల కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను, బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, సమితిసింగారం సర్పంచ్ బచ్చల భారతి, తహసీల్దార్ నాగరాజు, పీఏసీఎస్ చైర్మెన్ కుర్రి నాగేశ్వరరావు, పద్నాలుగు గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : తెలంగాణ ఉద్యమ కాలం నుండి తండాలు, రాజధాని వరకు మహిళలతో బతుకమ్మ ఆడే ఏర్పాట్లు చేసిన సీఎం కేసీఆర్ నేడు బతుకమ్మ పండుగను ప్రపంచ స్థాయికితీసుకెళ్లారని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో శుక్రవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాటా ్లడారు. అనంతరం మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, సర్పంచుల ఆధ్వర్యంలో పేదలకు బట్టలు పంపిణీ నిర్వహించారు. అదేవిధంగా ఇద్దరు లబ్ధిదారులకు 13 వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ కడ కంచి పద్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, తహశీల్దార్ కృష్ణవేణి, మున్సిపల్ కమిష నర్ అంకుషావలి, జడ్పీటీసీ ఉమాదేవి, వైస్ యంపీ పీ ప్రమోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురం : పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మండలంలో పర్యటించిన ఆయన తొలుత మొండికుంట గ్రామంలో దళిత బంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్‌ను ప్రారంభించారు. అదేవిధంగా మల్లెల మడుగు సీతారాంపురం గ్రామాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటుచేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అదేవిధంగా బతుకమ్మ చీరలను అందించి, మాట్లా డారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రెడ్డి సులక్షణ గోపిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యా లమ్మ వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం, సర్పంచ్ బానోత్ శారద, రైతు సమన్వయ కమిటీ నాయకులు ఈదర సత్యనారాయణ, గజ్జల లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ లు పూజిత, పద్మ,చిట్టెమ్మ సర్పంచులు పాయం భద్రయ్య, మర్రి మల్లారెడ్డి, సంధ్యారాణి, భద్రమ్మ, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సుజాతనగర్ : దసరా పండుగను తెలంగాణ ఆడపడుచులు ఘనంగా జరుపుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో బతుకమ్మ చీరలు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీ ల్దార్ సునీల్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ బానోత్ అనిత, ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.