Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజు కూలి రూ.600 ఇవ్వాలి
- వ్యకాస జిల్లా ప్రధానకార్యదర్శి మచ్చా
నవతెలంగాణ-చర్ల
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 ఏండ్లు గడిచినప్పటికీ కనీస వేతనాల జీవోని సమీక్ష చేయలేదని, కనీస వేతనాల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, పెరిగిన ధరలు కనుగుణంగా రోజుకూలి రూ.600 ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం తదితర డిమాండ్లపై వ్యకాస జిల్లా, మండల మహాసభ బందెల చంటి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మచ్చా వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు యలమంచి రవికుమార్‌లు మాట్లాడారు. బంగారు తెలంగాణ చేస్తానని రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకులు చిందర వందనం చేసేదిగా పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న కూలీలకు సంవత్సరం నుండి వేతనాలు బకాయిలుగా ఉన్నాయని, వివిధ కారణాలతో పనులు చేసిన కూలీలకు వేతనాలు ఇవ్వలేదని అన్నారు. కనీస వేతనాల చట్టం ప్రకారంగా కూలీలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేదలపై పెను భారాలు మోపుతుందని అన్నారు. పలు సమస్యలతో పాటు ఏజెన్సీ జిల్లాలలో గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఇప్పటివరకు పొజిషన్లో ఉన్న అందరకూ న్యాయం చేయాలని కోరారు. గూగుల్ మ్యాప్‌ల సర్వేలను ప్రామాణికంగా తీసుకోవద్దని అన్నారు. తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్న గిరిజన, గిరిజన ఇతర పేదల సాగులో ఉన్న భూములకు రక్షణ కల్పించాలని కోరారు.
అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వూడుగుల శారొని, కార్యదర్శిగా బందేల చంటి సభ్యులుగా కోటి ముత్యాలరావు, హరి నాగవర్మ, వరలక్ష్మి, గోలి గోపయ్య, కణితి జోగయ్య, నుపా మల్లయ్య, ఇర్పా రాజు, మడప కోటేశ్వరరావు, ఏళ్ళబోయిన లక్ష్మి, కొట్టెం దుర్గ ఎన్నికైనారు.