Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని మున్సిపాలిటీ యంత్రాంగం
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మున్సిపాలిటీలో సురక్షా బస్టాండ్ వెనుకభాగంలో గల శేషగిరినగర్ మసీద్ రోడ్డు మొదటి వీధిలో రోడ్డు పైనే మురుగునీరు ప్రవహిస్తుంది. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆరోపిన్నారు. బస్టాండ్ మరుగుదొడ్ల సముదాయానికి వెనుకభాగంలో రోడ్డు బాగా ఎత్తుగా ఉండడం వలన మురికి కాలువలు కూడా నీరు వెళ్లలేని పరిస్థితిలో వర్షపునీరు, డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో సుమారు ముప్పై ఇండ్ల ముందు మురుగు నీరు ప్రవహించక దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు వాపోతున్నారు. దీని కారణంగా దోమలకు ఆవాసాలుగా మారి ప్రజలు మలేరియా, డెంగ్యూ, విషజ్వరాల భారీన పడుతున్నామని తెలుపుతున్నారు. నాయుడుకుంట ఆధునీకీకరణ పేరుతో సురక్షాబస్టాండ్ నుండి శేషగిరినగర్ మీదుగా శివలింగాపురం వరకు భారీ కాలువ తవ్వారు. గత 4 సంవత్సరాలుగా నీరు ప్రవహించకుండా నీరు నీల్వ ఉంటున్నాయి. ఈ విషయాన్ని మున్సిపాల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆరోపిసున్నారు. పైలేట్ కాలనీ ఎక్స్లెంట్ పాఠశాల పరిసర ప్రాంతాలలో చెత్త పేరుకుపోయింది. చిన్నపాటి వర్షానికే చెత్త కారణంగా డ్రైనేజీ నుండి కట్టవాగు నీరు ఆ ప్రాంతాన్ని ముంపుకు గురి చేస్తుంది. అక్కడ నిర్మించిన సప్టా సరిగ్గా లేని కారణంగా ప్రతిసంవత్సరం ఈ ప్రాంతం ముంపుకు గురవుతుంది మున్సిపాలిటీ సిబ్బంది ఎక్కడ అవకాశం దొరికితే పారిశుధ్యంపై దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా మణుగూరు మున్సిపాలిటీలోని ఇరవై వార్డులలో మురుగునీరు నిల్వచేయకుండా చేయాలని, బ్లీచింగ్ చేయాలని ప్రజలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.