Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అప్జల్ హసన్‌కి ఉద్యోగుల వినతి
నవతెలంగాణ- ఖమ్మం
వైద్య విధాన పరిషత్ రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగుల ప్రమోషన్లకు కృషి చేయాలని కోరుతూ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు మెడికల్ ఫోరమ్ ఆధ్వర్యంలో టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అప్జల్ హసన్‌కి ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా మెడికల్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు పిరంగి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా వైద్య విధాన పరిషత్ శాఖలో 2014 తర్వాత రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగులుగా కొనసాగుతున్న తమకు గతంలో ప్రమోషన్‌కు టైప్ హైయ్యర్, లోయర్ ఉంటే సరిపోయేదని, ఎల్‌డిసిగా ప్రమోషన్ పొందడానికి జిల్లా కలెక్టర్‌కు ఆఫీస్ ఆటో మేషన్ అనే ఎగ్జామ్ నిర్వహించకపోవడంతో దాని వల్ల సర్వీస్ రెగ్యులైజేషన్ కాకపోగా, ప్రమోషన్‌కు అవకాశం కోల్పోతున్నామని, కరీంనగర్, నల్గొండ ఇతరేతర జిల్లాలో ఆయా జిల్లాల కలెక్టర్లు ఎగ్జామ్ నిర్వహించి అక్కడి ఉద్యోగులకు పదోన్నతి కల్పించారని, అలాగే తమ సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు అప్జల్ హసన్ మాట్లాడుతూ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల వినతి మేరకు జిల్లా మంత్రి పువ్వాడ అజరు కుమార్, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్‌ల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ ఫోరమ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పిరంగి శ్రీనివాసరావు, ఎస్డీ హాబీబ్, రమేష్, రహీం, సాయికృష్ణ, రాజేష్, అశ్విని, జగదీష్ పాల్గొన్నారు.