Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 49, 43, 52, 26, 37, 25, 39, 35వ డివిజన్లలో నగర మేయర్ పునుకొల్లు నీరజ చేతుల మీదుగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. 25 నుంచి అక్టోబర్ 3వ తారీకు వరకు జరుగుతున్నం దున ఈ ఉత్సవంలో మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించుకోవాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, ఉపమేయర్ ఫాతిమ జోహార, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న. కార్పొరేటర్లు బుర్రి వెంకటేశ్వర్లు, బిజి క్లైమేట్, గొళ్ల చంద్రకళ, మాడూరి ప్రసాద్, నాయకులు రామ్మోహన్, రవికాంత్, బుర్రి వినరు పాల్గొన్నారు.