Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నగరం 10వ డివిజన్ చైతన్య నగర్లో మున్సిపల్ సాధారణ నిధులు రూ.45 లక్షలతో నిర్మించనున్న సిసి డ్రెయిన్స్ నిర్మాణ పనులకు శుక్రవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర శంకుస్థాపన చేశారు. అనంతరం డివిజన్లో రూ.25 లక్షలతో నిర్మించిన పంచతంత్ర పార్కును ప్రారంభించారు. అనంతరం డివిజన్లలో మంజూరైన పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా డివిజన్ మహిళలకు చీరల లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ , కార్పొరేటర్ మాధురి తదితరులు పాల్గొన్నారు.