Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
స్వయం ఉపాధితో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కోర్స్ కోఆర్డినేటర్ వహీద్ పాషా పేర్కొన్నారు. చింతకాని మండల కేంద్రంలోని విజయభారతి మహిళా మండలి సభ్యులకు ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో అగరవత్తుల తయారీపై ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కోఆర్డినేటర్ వహీద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఉపాధి పొందుటకు సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, కొవ్వొత్తుల తయారీ, బ్యూటీషియన్, జ్యూట్ బ్యాగుల తయారీలో పది రోజులపాటు శిక్షణ ఇచ్చి ఉచిత సర్టిఫికెట్ టూల్ కిట్ సైతం అందజేస్తామన్నారు. శిక్షణకాలంలో వీరికి యూనిఫామ్ ఉచిత వసతి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ట్రైనర్ షరీఫ్ విజయభారతి మహిళా మండల సంఘం అధ్యక్షురాలు ధర్మపురి విజయలక్ష్మి మహిళలు రాణి స్రవంతి బేగం రాములమ్మ తిరుపతమ్మ బిబి సులోచన తదితరులు పాల్గొన్నారు.