Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులు శ్రమశక్తి అవార్డు గ్రహీత ఎండి రజాక్ శుక్రవారం పుట్టినరోజు పురస్కరించుకొని టీబీజీకేఎస్ కొత్తగూడెం బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చిరంజీవి ఆధ్వర్యంలో చుంచుపల్లి మండల ప్రాథమిక పాఠశాల అంబేద్కర్ నగర్ విద్యార్థుల అందరి మధ్య కేక్ కట్ చేసి పిల్లలందరికీ మిఠాయిలు పంచి రజాక్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూర్చునేందుకు కుర్చీలు వితరణగా ఇచ్చారు. బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిరంజీవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ మోహన్ రెడ్డి, పెనుగడప గ్రామస్తులు గౌతమ్, చిన్ని, సిడి రమేష్ , గోరె బాబు, కవిరాజు, హరీష్, నర్సయ్య, మురళి, రమేశ్ బాబు, రమాకాంత్, సన్నీ, వార్డ్ మెంబర్ రమేష్, మంతెన నర్సి, శంకర్, నాగేశ్వరావు హరీష్, అంబేద్కర్ నగర్ వాసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సెక్యూరిటీ కార్యాలయంలో : తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులు రజాక్ జన్మదిన వేడుకలు కొత్తగూడం ఏరియా సెక్యూరిటీ కార్యాలయంలో ఫిట్ సెక్రెటరీ సుద్దాల నరసింగం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫిట్ సెక్రటరీ సుద్దాల నరసింగం మాట్లాడారు. రాజేష్, అశోక్, పూర్ణచంద్రరావు, శ్రీనివాస రావు, సంపత్, కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, ధర్మరాజు, వీరస్వామి, సువర్ణ, ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్ శ్రీనివాస పాల్గొన్నారు.