Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కౌలు రైతుల గెలలు తీసుకోవాల్సిందే
- కార్యదర్శి తుంబూరు మహేశ్వర రెడ్డి
నవతెలంగాణ-అశ్వారావుపేట
కౌలు రైతులు గెలలు స్వీకరించడానికి వీలులేదని కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలకు, నిబంధనలు పేరుతో తెలంగాణ రైతుల గెలలను ఆయిల్ ఫెడ్ తిరస్కరించడానికి తెలంగాణ ఆయిల్‌ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫాం గ్రోవర్స్ సొసైటీకు ఏ సంబంధం లేదని ఆ సంస్థ కార్యదర్శి తుంబూరు మహేశ్వర రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు స్థానిక కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల పామ్ ఆయిల్ గెలలు నిల్వలు, అవి కుళ్ళిపోవడంపై కలెక్టర్ అనుదీప్ ఈ నెల 21 నిబంధనలు జారీ చేస్తే, పామ్ ఆయిల్ సాగు దారులు ఎదుర్కొంటున్న సమస్యలు పై మా సంస్థ ప్రతినిధులు 22న కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేసామని కానీ దీనిపై కొందరు రైతు నాయకులు కౌలు రైతులు గెలలపై రాద్దాంతం చేసి సామాన్య రైతులను అయోమయానికి గురి చేస్తూ రాజకీయ చేస్తున్నారని మండిపడ్డారు. నకిలీ ఎఫ్ కోడ్లను రద్దు చేయాలని, ఆంధ్రా రైతులు గెలలు నివారించాలని, కలెక్షన్ సెంటర్లలో వే బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయాలని, గెలలు దిగుమతి చేసిన వెంటనే రైతులకు చర వాణి సందేశాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మాత్రమే మేము కలెక్టర్ వినతి పత్రంఅందజేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో సాగు చేసిన ఏ రైతుల గెలలు అయినా బేషరతుగా ఆయిల్ ఫెడ్ స్వీకరించాలని వారు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కొక్కెరపాటి పుల్లయ్య, రావు జోగేశ్వరరావు, మద్దినేని వెంకట్, ఆళ్ళ నాగేశ్వరరావు, చెలికాని సూరిబాబు, రాంబాబులు పాల్గొన్నారు.