Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ పట్టణంలో ఉన్న పాఠశాలలు, కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. స్వయంగా బతుకమ్మను పూలతో పేర్చి పాఠశాలకు, కళాశాలకు విద్యార్థులు తీసుకుని వచ్చి పాటలకు నృత్యాలను వేశారు.
అనుభూస్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
స్థానిక అనుభూతి ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని విద్యార్థినీలు, కళాశాల సిబ్బంది అందరూ ఉత్సవంలో పాల్గొన్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మను అలంకరించి ఆటపాటలతో ఉత్సాహంగా కోలాహలంగా బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సంబరాల్లో కళాశాల చైర్మన్ డాక్టర్ భరత్ కృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వి సుబ్బారావు, అన్ని విభాగ్యపతులు అధ్యాపకులు పాల్గొని భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఉత్సవ నిర్వహించారు.
డీఏవీ పాఠశాలలో..
కేటీపీఎస్ డీఏవి పాఠశాలలో ప్రిన్సిపాల్ ఏ.రామారావు ఆధ్వర్యంలో విద్యార్థులే స్వయంగా బతుకమ్మను పూలతో పేర్చి జానపద బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు, కోఆర్డినేటర్స్ రాజశేఖర్, సుష్మా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
త్రివేణి పాఠశాలలో..
స్థానిక దమ్మపేట సెంటర్లో గల త్రివేణి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. పాఠశాల విద్యార్థులు అమ్మవార్ల వేషధారణలో అందరిని ఆకర్షించి కలలు పండగ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.ఎన్.రమేష్, ఇన్చార్జి జి.కవిత ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ డాక్టర్ జి.వీరేంద్ర చౌదరి, జగదీష్, సీఆర్ఓ మురళీకృష్ణ, విద్యార్థులు, తల్లిదండ్రులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.