Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-మణుగూరు
పినపాక నియోజకవర్గంలోని దళిత విలేకర్ల అందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తున్నట్టు విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసినా పినపాక నియోజకవర్గ దళిత విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ దళితులు సామాజికంగా అభివృద్ధి చెంది సమూల మార్పు కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ఉన్న విలేకర్లందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. స్వాతంత్య్రం సిద్దించి 75 ఏండ్లు గడుస్తున్నా రూ.లక్ష విలువ తెలియని దళితులు ఉండడం దురదృష్ట కరమన్నారు. దళితులు స్వయం సంవృద్ధి సాధించడం కోసం దళితబంధు పథకం ఎంతో ఉపయోగపడు తుందన్నారు. ప్రభుత్వం అందించే రూ.10 లక్షలను పెట్టుబడిగా ఉపయో గించుకో ని యజమాను లుగా ఎదగాలని కోరారు. దళిత బంధు ఏండేండ్ల పథకమని, రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ ఈ పథకం అందుతుందన్నారు. దళితబంధు పథకంతో ఆర్ధికాభివృద్ధి చెంది రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, మండల పట్టణ అధ్యక్షులు ముత్యంబాబు, అడపా అప్పారావు, రామిడి రాంరెడ్డి, బొలిశెట్టి నవీన్, అధికసంఖ్యలో విలేకరులు తదితరులు పాల్గొన్నారు.