Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుబాటులో 24గంటలు వైద్యం
- డాక్టర్లు స్వప్న, శంకర్ నాయక్
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని ఆర్సీఎం చర్చి ఎదురుగా ఉన్న న్యూ లైఫ్ హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు స్త్రీల వైద్య నిపుణురాలు డా.స్వప్న, డా.శంకర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు శనివారం విలేకరులతో మాట్లాడారు. అత్యాధునిక పూర్తిస్థాయి మెటర్నిటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉచిత సేవల సందర్భంగా ఆదివారం పరీక్ష ఫీజు రూ.200 మినహాయించినట్లు తెలిపారు. గర్భిణీలకు 24 గంటలు వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. తెల్లబట్ట సమస్యలు, సంతానం లేని వారికి వైద్యం నిర్వహిస్తామని తెలిపారు. గర్భసంచిలో గడ్డలు కణతలు, అడ్వంసుడు లాప్రోస్కోపిక్ ద్వార తీసివేయబడునని తెలిపారు. పిల్లలు పుట్టకుండ కుటుంబ నియంత్రణ అపరేషన్, ట్యూబ్రల్ రికన్యూలైజేషన్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ ద్వార సర్జరి, నార్మల్ డెలివరి, స్త్రీలకు సంబందించి సలహాలు, సూచనలు ప్రత్యేకంగా ఇవ్వనున్నామని తెలిపారు. 24 గంటలు గర్భిణీలకు ఆపరేషన్ థియేటర్ ల్యాబ్ ఫార్మసి సౌకర్యం కలదని తెలిపారు. 24 గంటలు ఆల్ట్రాసౌండ్ స్క్యాన్ సౌకర్యం కలదు. రూ.500 విలువ గల థైరాయిడ్ టెస్ట్ కేవలం రూ.200 లకేచేయబడునని తెలిపారు. స్త్రీలకు ఇర్రెగ్యులర్ పిరియడ్స్ చూడబడును, చిన్న పిల్లలకు ఫెటల్ థెరపి చేయబడునని తెలిపారు. ఈసీజీ (గుండెపరీక్ష), ల్యాబ్ నందు 50శాతం రాయితీ సౌకర్యం కలదు. ఎమర్జెన్సీ, ఐసీయూ ఫార్మసి, ల్యాబ్, అంబులెన్స్ సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు. వివరాలకు సెల్ నెంబర్ 9490012777, 7671050170 సంప్రదించాలని కోరారు.