Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయకులు...కార్మికుల అక్రమ అరెస్టులు
- మహిళా కార్మికులను సైతం ఈడ్చుకెెళ్లిన పోలీసులు
- యాజమన్యం రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి
- అక్రమ అరెస్టులను నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు, ఆందోళన
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు శాంతి యుతంగా 16వ రోజు చేస్తున్న నిరవదిక సమ్మె సందర్భంగా హెడ్ ఆఫీస్ దిగ్బంధనం చేసిన కాంట్రాక్ట్ కార్మికులు, జేఏసీ నాయకులను, కాంట్రాక్ట్ కార్మికులను బలవంతంగా అక్రమంగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. శాంతి యుతంగా జరుగుతున్న సమ్మెను పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ గార్డులు ఉసిగొలిపి అరెస్టులకు పూనుకున్నారు. ఉదయం కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు మేయిన్ గేటు ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వారిని ఎలాగైన చెల్లాచెదురు చేయాలని పోలీసులు, సెక్యూరిటీ గార్డులు పూనుకున్నారు. సమ్మె చేస్తున్న కార్మికులను, నాయకులను గేటు ముందు నుండి వెళ్లిపోవాలని, పక్కనే కేటాయించిన స్థలంలో సమ్మె చేసుకోవాలని వారించారు. దీంతో ఆందోళన కారులకు, పోలీసులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితిలో నాయకులను, కార్మికులున బలవంతంగా ఈడ్చుకు వెళ్లి, వాహానాల్లో పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆందోళన కారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మహిళలను సైతం బలవంతంగా లాక్కోనివెళ్లి వాహనాలు ఎక్కించి, పోలీస్టేషన్‌కు తరలించారు. ప్రధాన కార్యాలయం ముందు ఒక్కసారిగి ఉద్రికత్తత వాతావరణం చోటు చేసుకుంది. నాయకులు అరెస్టులను ఖండిస్తు కార్మికులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తు సమ్మెలను కొనసాగించారు.
అక్రమ అరెస్టులను ఖండించిన జేఏసీ
సింగరేణి యాజమాన్యం అక్రమ అరెస్టుల ద్వారా కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుందని, యాజమాన్యానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సరైంది కాదని జేఏసీ నాయకులు విమర్శించారు. శనివారం శాంతియుతంగా పోరాడుతున్న సమ్మెపై పోలీసులు మూకుమ్మడిగా చేసిన దాడి, నిర్బంధాలను తీవ్రంగా ఖండించాలని పిలుపు నిచారు. పట్టుదలతో ఉద్యమాన్ని కొనసాగించాలని కార్మికులకు పిలుపు నిచ్చారు. అక్రమ అరెస్టులను ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీల నాయకులు ఖండించాలన్నారు. తమ వేతనాలను పెంచాలని, యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని, ఫిబ్రవరి 9న ఇచ్చిన హామీలను అమలు చేయాలని పోరాడుతున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులపై యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి బలవంతంగా అక్రమంగా నాయకులను కాంట్రాక్ట్ కార్మికులను కిందపడేసి ఈడ్చుకుంటూ పోలీస్ జీవులను తెచ్చి బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, యర్రగాని కృష్ణయ్య, ఇనపనూరి నాగేశ్వరరావు, కాలం నాగభూషణం, పి.సతీష్, జి.శ్యాం కుమార్, మోత్కూరి మల్లికార్జున్‌తో పాటు 25 మంది కాంటాక్ట్ కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి కొత్తగూడెం ఒకటో పోలీస్ స్టేషన్, రెండో పోలీస్ టౌన్ స్టేషన్లలో నిర్బంధించారు.
ఖండించిన నాయకులు
ఈ అక్రమ అరెస్టులను నిరసిస్తూ కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పోలీస్ స్టేషన్లలో నిర్బంధంలో ఉన్న జేఏసీ నాయకులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు, మిర్యాల రంగయ్య, కె.సారయ్య, వాసిరెడ్డి మురళి, గెద్దాడ నగేష్, ఐఎన్టియూసీ నాయకులు ఎస్ఏ.జలీల్, త్యాగరాజ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి.అప్పారావు, డి.వీరన్న, తదితరులు పరామర్శించి ఈ అరెస్టులను తీవ్రంగా ఖండించినారు. తక్షణమే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అరెస్టుల ద్వారా ఉద్యమాలను ఆపలేరని, యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కందగట్ల సురేందర్, పిట్టల రామచందర్, కిషోర్, కిషన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.