Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఏసీ రాస్తారోకో విజయవంతం
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల కేంద్రమైన బూర్గంపాడులో జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన రాస్తారోకో విజయ వంతమైంది. బూర్గంపాడు లోని అంబేద్కర్ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ, వివిధ రాజకీయ పక్షాల నాయకులు మాట్లాడుతూ బూర్గంపాడు మండలం గోదావరి వరదలతో అతలాకుతలం అవుతుందని అన్నారు. మండలంలో ముంపుకు గురవుతున్న ప్రాంతాలకు పోలవరం ప్యాకేజీ ఇవ్వాల్సిం దేనని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఈ సమస్యకు పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్.ఆర్ పరిహారం అందించాలని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో 37 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగు తున్నాయని పేర్కొన్నారు. బూర్గంపాడు గ్రామానికి కరకట్ట శాశ్వత పరిష్కారం కాదని ఇరు రాష్ట్ర సీఎంలు చర్చలు జరిపాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ రాజ కీయ పక్షాల నాయకులు సంఘీభావం తెలిపి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజ కవర్గ ఇన్చార్జి చందా సంతోష్, పూలపెల్లి సుధాకర్ రెడ్డి, దుగ్యంపుడి కృష్ణారెడ్డి, బర్ల నాగ మణి, మందా నాగరాజు, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎస్.కె.ఛోటే, మహమ్మద్ ఖాన్, సీపీఐ(ఎం) నాయకులు రాయల వెంకటేశ్వర్లు, భయ్యా రాము, కొమార్రాజు సత్యనా రాయణ, సీపీఐ నాయకులు పేరాల శ్రీను, జహూర్, ఎండి సాజిద్, బీఎస్పీ నాయకులు జున్ను రవి, కృష్ణ, దామోదర దాము, డాక్టర్ శేషు, కేసుపాక సాధన, న్యూ సెంచరీ విద్యాసంస్థల అధినేత ఆశిక్ లైక్, అయ్యోరి శ్రీహరి, జేఏసీ కమిటీ కన్వీనర్ కే.వీ.రమణ, ప్రధాన కార్యదర్శి శ్రీను తదితరులు పాల్గొన్నారు.