Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు
నవతెలంగాణ-ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనుమతులు లేని ల్యాబ్‌లపై సోదాలు నిర్వహించాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లిక్కి బాలరాజు, కాలంగి హరికృష్ణ డిమాండ్ చేశారు. స్తానిక మశివాగు తండాలో శనివారం జరిగిన సమావేశంలో వారూ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలలో ల్యాబ్‌లు ఆదునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని, ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రులు అనుమతి లేవని సీజ్ చేస్తున్నటువంటి వైద్యశాఖ అధికారుల కృషి అభినందనీయం అన్నారు. తక్షణమే ల్యాబ్లపైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో వాటి ఎదుట అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి హాస్పిటల్ ఎదుట ప్రత్యక్ష ఆందోళనకు నిర్వహిస్తామని అన్నారు.