Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆడి...పాడిన చిన్నారులు
కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. శనివారం పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు జరిపారు. విద్యార్థులను వివిధ వేషధారణలో అలంకరించారు. పాఠశాల ఆవరణలో బతుకమ్మను ఆడారు. మున్సిపల్ పరిధిలోని బూడిదగడ్డ ఏరియాలోని 'ఆకిడ్స్' పాఠశాలలో ఘనంగా జరిగిన బతుకమ్మ వేడుకల్లో చిన్నారులు నవదుర్గ వేషధారణలో అలంకరించారు. ఈ వేడుకల్లో యాజమాన్యం డి.మధుసూధన్, డి.విద్యాసాగర్, ప్రిన్సిపల్ ఎం.శ్రీదేవి, టీచర్స్, చిన్నారులు, సిబ్బంది పాల్గొన్నారు.
త్రివేణిలో : లక్ష్మీదేవిపల్లిలోగల త్రివేణి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. త్రివేణి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆటపాటలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రివేణి పాఠశాలల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్ హాజరై, పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. దసరా పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అమ్మవారియొక్క తొమ్మిది అవతారాల వేషాధారణలో విద్యార్థులు అందరిని ఆకట్టుకున్నారు. దుర్గాదేవి నరకాసురుని వధించిన కథని నృత్యరూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా త్రివేణి పాఠశాలల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, ప్రిన్సిపాల్స్ వైవి. సురేష్, శ్రీనివాస్ సింగ్, కిడ్స్ వైస్ ప్రిన్సిపాల్ సౌజన్య చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ రాగాలో : కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని మేదరబస్తీలోగల శ్రీరాగా ప్లే స్కూల్ అండ్ శ్రీరాగా హై స్కూల్లో శనివారం దసరా పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా కరస్పాండెంట్ మల్లారపు వరప్రసాద్, డైరెక్టర్ మల్లారపు కవితలు అమ్మవారికి పూజలు నిర్వహించారు. 7 అడుగుల బతుకమ్మతో బతుకమ్మ ఆటా....పాట నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఫాన్సీ గెటప్స్లు వేశారు. ఆకర్షణీయంగా నిలిచిన బతుకమ్మలకు యాజమాన్యం బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రాంబాబు, సంధ్య, యాస్మిన్, సర్వేశ్వర రావు, సైమన్, ప్రసాద్, పద్మావతి, అనూష, నవ్యశ్రీ, కీర్తీ, పుష్ప లతలు పాల్గొన్నారు.
'విద్యార్థులు సేవా దృక్పథం కలిగి ఉండాలి'
దుమ్ముగూడెం : ప్రతి విద్యార్థి సేవా దృక్పథం కలిగి ఉండాలని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ యం.శ్రీనివాసరావు అన్నారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంచార్జ్ ప్రిన్సిపాల్ వై.మల్లికార్జున రావు అధ్యక్షత జరిగిన కార్యక్రమం శ్రీనివాసరావు జాతీయ సేవా పథకం విశిష్టత గురించి తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలో పారిశుధ్య పనులు నిర్వహించారు. కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.