Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉత్పత్తిని అడ్డుకుంటామని జేఏసీ నాయకులు రేపాకుల శ్రీనివాసు, డి.ప్రసాద్, గుగులోత్ రాంచందర్, కోటిలింగం, మారుతిరావులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం కోయగూడెం ఓసీ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు, వీరన్న, సుందర్, శ్రీరాములు, నవీన్, చిట్టిబాబు, వెంకటనర్సు, మంగ్య, రమేష్, సురేందర్, వెంకన్న, రాము, బాలు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : సింగరేణి కాంట్రాక్టు కార్మికులు తమ వేతనాలు పెంచాలని గత 16 రోజులనుండి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. యాజమాన్యం వేతనాలు పెంచడానికి ముందుకు రావడంలేదు. దీంతో శనివారం సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులు జీఎం ఆఫీస్‌ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి బంధం నాగయ్య అధ్యక్షతన సభ నిర్వహించారు. రాజకీయపార్టీల అఖిలపక్ష నాయకులు ఎస్ఏ.నబి, ఆర్.బోస్, సారంగపాణి, రామ్ సింగ్, రాములు, రాయల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో షేక్ యాకుబ్ షావలి, టి.కృష్ణ, శ్రీను, టి.నాగేశ్వరరావు, మల్లెల వెంకటే శ్వర్లు, మంద కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం జేఏసీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి: జేఏసీ
వేతనాలు పెంచాలని కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్న జేఏసీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఇడ్చికెళ్లడాన్ని జేఏసీ నాయకులు దేవరకొండ శంకర్, ఎండి రాసు ద్దిన్, కే.సారంగపాణి, తాళ్లూరి కృష్ణ, షేక్ యాకుబ్ షావలి తీవ్రంగా ఓ ప్రకటనలో ఖండించారు.
మణుగూరు : సింగరేణి యాజామాన్యం వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి వల్లూరి వెంకటరత్నం డిమాండు చేశారు. శనివారం పివీకాలనీ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఆర్దిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు అవుతున్నా సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాచారపు లక్ష్మణ్‌రావు, ప్రభాకర్, నందం ఈశ్వరరావు, బుచ్చిరెడ్డి, విల్సన్‌రాజు, లక్ష్మణ్‌రావు, భిక్షపతి, ముజఫర్ రామకృష్ణ, వినోద్, శ్రీను, సుమన్, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.