Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలి
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రదర్శన
- తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ-భద్రాచలం
దేశ ప్రజలపై భారాలు మోపుతూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ఇంటికి సాగనంపాలని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు పేదలందరికీ అందివ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ డిమాండ్ చేశారు. పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం వందలాదిమంది పేదలు ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఏజే రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ గత ఏడు సంవత్సరాల కాలంలో సామాన్య ప్రజలకు చేసిందేమీ లేదని, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజలపై భారాలు మోపిందని అన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నరసారెడ్డి మాట్లాడుతూ నష్టపరిహారం అందని గోదావరి వరద బాధితులు అందరికీ నష్టపరిహారం రూ.10వేలు అందించాలన్నారు. తక్షణమే ముంపు బాధితుల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ముంపు కాలనీల ప్రజల అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకొని ముంపు నుండి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి పూనుకోవాలని డిమాండ్ చేశారు.
తక్షణమే ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి : గడ్డం స్వామి
కాలనీలో హడావిడిగా సర్వేలు చేయకుండా గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి డిమాండ్ చేశారు. ఈ సభలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మర్లపాటి రేణుక ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, పి.సంతోష్ కుమార్, ఎన్.లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు డి.సీతాలక్ష్మి, ఉస్తేల జ్యోతి, సిహెచ్ మాధవరావు, జీవనజ్యోతి, కుంజా శ్రీనివాస్, జి.లక్ష్మీకాంత్, ఎన్.నాగరాజు, ఎస్.రామకృష్ణ, అంబోజి రత్నం సండ్ర భూపేంద్ర, కోరాడ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల నడ్డివిరుస్తున్న కేంద్ర ప్రభుత్వ
ఆర్ధిక విధానాలు : కనకయ్య
మణుగూరు : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ఆర్ధిక విధానాల వలన ప్రజల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు పాలు అవుతున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. శనివారం రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా మండలంలో ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రజలు ఆర్దిక ఇబ్బందుల్లో కూరుకుపోయారన్నారు. కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గితే దేశంలో కేంద్రప్రభుత్వం పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గించకపోవడం విచారకరకమన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను కొల్లగొట్టి, ఆదాని, అంబానీలకు పెట్టుబ డిదారుల ఆస్తులు పెంచుతుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వంద రోజుల నుండి రెండు వందల రోజులు పెంచాలని రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కొడిశాల రాములు, సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, లెనిన్‌బాబు, ఉప్పతల నర్సింహారావు, మడి నర్సింహారావు, పిట్టల నాగమణి, వైనాల నాగలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి : కాసాని
సుజాతనగర్ : పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాలపై విధిస్తున్న జీఎస్టీ సేవలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య డిమాండ్ చేశారు. శనివారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు ధర్మ, మండల కార్యదర్శి ఈర్ల రమేష్, గండమల భాస్కర్, బచ్చలకూర శ్రీనివాస్, పుల్లయ్య, కొంపెల్లి ఐలయ్య, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తక్షణం గద్దె దిగాలని సీపీఐ(ఎం) నేతలు అబ్దుల్ నబి, దేవులపల్లి యాకయ్య డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కమిటీ శనివారం దేశ వ్యాపితంగా నిరసన కార్యక్రమాలు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపు నిచ్చింది. అందులో భాగంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం తహసీల్దార్ కృష్ణవేణి వినతి పత్రాన్ని సమర్పించారు. అంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు బీజేపీ ఆటలు సగనివ్వదని అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్ కుమార్, వజ్జ సురేష్, మన్యం మోహన్ రావు, కూకట్ల శంకర్, లక్క రాజేశ్వరరావు, నాగరాజు, షాహిద్, సత్యనారాయణ కోరి, వెంకన్న, వైకుంఠం, కౌసల్య, జ్యోతి, సాంకు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీ కృష్ణ అన్నారు. శనివారం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆర్ఐ ఆదినారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, సరియం రాజమ్మ, మండల నాయకులు సోయం కృష్ణమూర్తి, పున్నారావు, శ్యామల బోజ్జి, కళ్యాణ్, శెట్టి శ్రీను, కొరస సీతారామయ్య ఇంకా తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ విమర్శించారు. మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసం నరసింహారావు, కమిటీ సభ్యులు కడుదుల వీరన్న, కోటేశ్వరి, లలిత, ప్రేమ్ కుమార్, బుచ్చయ్య, చింత శ్రీను, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పినపాక : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సీపీఐ(ఎం) మండల కన్వీనర్ నిమ్మల వెంకన్న ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రదర్శన, నిర్వహించి, మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డీటీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు జోగయ్య, శాఖ కార్యదర్శిలు కురసం లక్ష్మయ్య, భీమయ్య, సమ్మయ్య, చందు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : నిత్యావసర సరుకులపై విధించిన జీఎస్టీ ఎత్తి వేయాలని సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ బి.చిరంజీవి నేతృత్వంలో శనివారం తహశీల్దార్ చల్లా ప్రసాద్‌కు వినతి పత్రం అందజేసారు. అనంతరం జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ముళ్ళగిరి గంగరాజు, మడిపల్లి వెంకటేశ్వరరావు, తగరం జగన్నాధం, కలపాల భద్రం, రవి, విష్ణులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యవసర ధరలు తగ్గించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ప్రజలపై జీఎస్టీ రూపంలో వేస్తున్న పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసరాల ధరలను అడ్డు, అదుపు లేకుండా పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్ర మంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్, భూక్యా రమేష్, ఎస్.లక్ష్మీ, పట్టణ కమిటీ సభ్యులు డి.వీరన్న, నాయకులు రాజారావు, వీరభద్రం, జాలాల్, వెంకటేశ్వర రావు, రామ్ చరణ్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవి పల్లి మండలంలో...
కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తులపై ధారుణంగా జీఎస్టీలు వేయడం ధారుణమని, వెంటనే జీఎస్టీని తొలగించాలని సీపీఐ(ఎం) లక్ష్మీదేవి పల్లి మండల కార్యదర్శి యు.నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశ పెట్టిన జీఎస్టీకి వ్యతిరేకంగా రేగళ్ల సెంటర్లో శనివారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడారు. మండల కమిటీ సభ్యులు వాంకుడోత్ కోబల్, ఎన్.సూర్య, డి.వెంకన్న, ఎల్.కుమార్, టి.వెంకన్న, టి.శ్రీనివాస్, వి.సురేష్, జి.సుధీర్, గోపాల్, రాంబాబు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.