Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని స్థానిక 22వ డివిజన్ కార్పొరేటర్ పల్లా రోజ్ లీనా భర్త పల్లా సాల్మాన్ రాజు మృతి పట్ల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు . శనివారం చర్చి కాంపౌండ్‌లో ఉంటున్న కార్పొరేటర్ పల్లా రోజ్ లీనా గృహానికి పొంగులేటి వెళ్లి పల్లారోజ్ లీనాను, ఆమె కుమారుడు పల్లాజాన్ అబ్రహంను పరామర్శించారు .అనంతరం పల్లా సాల్మాన్ రాజు చిత్రపటానికి పూలమాలవేసి నివాలర్పించారు. కార్యక్రమంలో పల్లా కుటుంబ సభ్యులు పల్లా కిరణ్ కుమార్, పల్లా రాజశేఖర్, జావిద్, మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.