Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఈ మేరకు శనివారం మణుగూరు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గంలోని దళిత ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులతో ఆయన సమావేశమయ్యారు. అందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 45 మంది దళిత విలేకరులకు దళిత బంధు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. దళిత బంధు పథకంపై ప్రకటనలు, ప్రచారాలు ఆయా మీడియా మాధ్యమాల ద్వారా దళిత ప్రజలందరికీ చేరువయ్యే విధంగా విలేకరులు అవగాహన కల్పించాలని అన్నారు.