Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుళ్ళిన గెలలు తెచ్చిన తంటా...
- నాటి అక్రమాలు వైపు మళ్ళిన రూటు....
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఆయిల్ ఫాం ఫ్యాక్టరీలో నేడు కుళ్ళిన ఆయిల్ ఫాం గెలలు తంటా ఆయిల్ ఫెడ్ లో నాటి అక్రమాలు వైపు రూటు మార్చుకుంది. కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు మేరకు జిల్లా ఆడిటర్లు బృందం శనివారం డివిజన్ కార్యాలయం, ఫ్యాక్టరీ కార్యాలయాల్లో విచారణ చేపట్టింది. ఇటీవల ఫ్యాక్టరీ సామర్ధ్యానికి మించి గెలలు ఫ్యాక్టరీకి రావడంతో యాజమాన్యం వారం పాటు ఫ్రూట్ హాలిడే ప్రకటించారు. ఈ క్రమంలో నిల్వ ఉంచిన గెలలు కుళ్ళిపోయాయి. ఈ ఉదంతం నవతెలంగాణ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో కొందరు రైతులు కలెక్టర్ అనుదీప్ వద్దకు వెళ్లి కుళ్ళిన గెలలతో పాటు ఆయిల్‌ఫెడ్ గతేడాది చోటు చేసుకున్న పలు అక్రమాలపై ఫిర్యాదు చేసారు. స్పందించిన కలెక్టర్ అనుదీప్ రైతులు ఫిర్యాదు చేసిన అంశాలపై విచారించాలని జిల్లా ఆడిటర్ వెంకటేశ్వర రెడ్డితో మరో నలుగురు ఆడిటర్ లు బృందాన్ని ఆదేశించారు. శనివారం విచారణకు వచ్చిన ఈ బృందం డివిజన్ కార్యాలయం, ఫ్యాక్టరీ కార్యాలయాల్లో విచారణ చేపట్టారు. మధిర ప్రాంతంలోని గెలలు సేకరణ కేంద్రం పేరుతో ఓ రైతు రవాణా చేసిన గెలలకు రవాణా చార్జీలో చోటు చేసుకున్న కోటి రూపాయల అవినీతి, గతేడాది పామ్ ఆయిల్ మొక్కల అక్రమ విక్రయంపైనా విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విచారణ బృందంలో సీనియర్ ఆడిటర్లు కె.రామక్రిష్ణ, ఆర్.వెంకటేశ్వర్లు, వి.మమత, టి.రామదాసు లు ఉన్నారు.