Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని స్థానిక 26వ డివిజన్లో ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు కలిసి శనివారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. రేపటి నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో సి.హెచ్ పద్మావతి ఆధ్వర్యంలో విద్యార్థులు అందరూ కలిసి ఆటపాటలతో కోలాట నృత్యాలతో చిందులు వేస్తూ అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల హెచ్.ఎం సాంబమూర్తి, రామకోటేశ్వరరావు, జయరాజు, సుజాత, రిజ్వాన్, గౌస్ సింగ్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
మధిర పలు పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
మధిర : తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో ముందుగానే స్థానిక మిలీనియం, ఠాగూర్, భరత్, గర్ల్స్ హై స్కూల్, మాటూరు ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థినిలు సాంప్రదాయ దుస్తులు ధరించి వివిధ రకాల పూలతో బతుకమ్మలను అలంకరించి తయారు చేసుకుని ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
నవతెలంగాణ-ఖమ్మం
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగను శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్లో శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముఖ్యఅతిధిగా పోలీస్ కమిషనర్ సతీమణి స్కూల్ చైర్ పర్సన్ హృదయ మేనన్ పాల్గొని వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని, మహిళలు పండగను ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శేషగిరిరావు, ఉపాధ్యాయులు,విద్యార్థినిలు పాల్గొన్నారు.