Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండల పరిధిలో పెద్దమండవ, మాదాపురం, పమ్మి, ఖానాపురం, పండ్రేగుపల్లి, న్యూలక్ష్మీపురం, సువర్ణాపురం, చిరుమర్రి, మేడేపల్లి, వెంకటాపురం, గ్రామాలలో బతుకమ్మ చీరలను ఆయా గ్రామ పంచాయతీ సర్పంచులు శనివారం మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సామినేని హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు చెట్టుపోగు రామారావు, ఎర్రబోలు వేణుగోపాల్ రెడ్డి, సామినేని రమేష్, కోటి అనంతరాములు, వాకధాని కన్నయ్య, కొట్టే అపర్ణ, కొండమీది సువార్త, మాలోజి ఉషాగోవింద్, ఎంపీటీసీ సభ్యులు ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ, ఆశా, రేషన్ డీలర్స్ పాల్గొన్నారు.