Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తిరుగుబాటు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) నాయకులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి యాస నరేష్ మాట్లాడుతూ.. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, మళ్లీ రెండోసారి అధికారంలోకి వచ్చాక పేద ప్రజలపై విరుచుకుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గార్లపాటి వెంకటి, గడిదేసి కనకరత్నం, బానోత్ ఇస్రా, రాధాకృష్ణ, దానయ్య, లక్ష్మయ్య, అభిమిత్ర తదితరులు పాల్గొన్నారు.