Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఆయిల్ పామ్ సాగు బాగుంటేనే నూనె ఉత్పత్తులు అధికంగా వస్తాయని తద్వారా భారత దేశం వంట నూనెల సంవృద్ధి బాగుంటుందని, ఫ్యాక్టరీ మనుగడ సాగిస్తుందని, దీనిని గమనించి అధికారులు రైతులకు సమస్యలు లేకుండ చూడాలని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆయిల్‌ఫెడ్ మేనేజర్ బాలకృష్ణకు వినతి చేసారు. శనివారం ఆయన అశ్వారావుపేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సందర్శించి ఫ్యాక్టరీలో నిల్వ ఉన్న గెలలును, క్రషింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రేస్ అధ్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవరావు, సీనియర్ నాయకులు సుంకపల్లి వీరభద్రరావు, జేస్త సత్యనారాయణ చౌదరి, అంకత మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు.