Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలి
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను దసరా సెలవు దినములలో పూర్తి చేయాలని టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తగూడెం యూటిఎఫ్ కార్యాలయం టీచర్స్ భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశం బి.కిషోర్ సింగ్ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో రాజు పాల్గొని మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామి ప్రకారం రాష్ట్రంలోని ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు షెడ్యులు వెంటనే విడుదల చేయాలని, దసరా సెలవు దినాలలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయాలని, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ప్రధానోపాధ్యాయ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని బదిలీలు వెంటనే చేపట్టాలని డిమోండ్ చేశారు. సీపిఎస్‌ను రద్దు చేయాలని, పాతపెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఎస్టిఎఫ్ఐ సంతకాల సేకరణ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.కృష్ణ ఉపాధ్యక్షులు వి.వరలక్ష్మీ కోశాధికారి (ఎస్వి.) ఎస్.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు జే.మురళీ మోహన్, బి.బిక్కు, డి.దాసు, కె.గంగాధర్, ఎం.కృష్ణారావు, బి.రాము, డి.ధావుర్యా, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.