Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరణాలు తగ్గించేందుకు కృషి చేయాలి
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వ అసుపత్రిలో మాతృమరణాలు తగ్గించాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ వైద్యులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖలో, ఇటీవల మరగించిన మాతృ మరణాలపై వైద్యాధికారులను ప్రశ్నించారు. జరిగిన సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్త 6 మాతృ మరణాలు జరిగాయి. ఈ సంఘటలనపై సంబంధిత వైద్యాధికారులు, ఏరియా హాస్పటల్ సూపరింటెండ్లు వైద్యసిబ్బందితో సంయుక్త సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాటాడుతూ మాతృ మరణాలపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లి ఫ్రంట్లైన్ వర్కర్స్ ఆశాలు, ఏఎన్ఎంలు గర్భణీల నమోదు నిర్వహించే విధంగా చేయాలన్నారు. వారికి అన్ని రకాల సేవలందించేందుకు విశేషకృషి చేయాలని సూచిం చారు. మొదటి పరీక్షలు, రెండవ పరీక్షలు వైద్యాధి కారులతో తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. మూడవ, నాలుగువ పరీక్షలు గైనకాలజిస్టుతో నిర్వహించి మరణాలను తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలాంటి మరణాలు సంభవించకుండా చూడాల న్నారు. ఈ కార్యక్రమములో డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె.దయానంద స్వామి, ఎంసీహెచ్ పీఓ డాక్టర్ సుజాత, గైనకాలజిస్టు డాక్టర్ సరళ, డాక్టర్ భారతి, సూపరింటెండెట్లు డాక్టర్ చైతన్య, డాక్టర్ శ్రీలత, డాక్టర్ రాజశేఖర్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ ఎండీ.ఫైజ్ మెయిద్దీన్, వైద్యాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.