Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులం, మతంతో చిచ్చులు పెట్టి ఓట్లు దండుకుంటుందని జ్యోతిరావు పూలే సత్య శోధక్ సమాజ్ స్ఫూర్తితో కుల నిర్మూలనకు కృషి చేద్దామని ప్రజా పంథా మండల కార్యదర్శి నాని రాజు పిలుపునిచ్చారు. కులాలకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆదివారం మండలంలోని పోలారం గ్రామంలో కుల మతాలకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించి సభ జరిపారు. అందులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెబుతుందని చెప్పుకుంటున్న భారతదేశంలో మాత్రం కులం సమస్య మనసుల మధ్య వైరుధ్యాలను పెంచుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పోలారం ఏరియా ఆర్గనైజర్ వి.అజరు, పార్టీ డివిజన్ నాయకులు శ్రీరామ్ కోటయ్య, శ్రీరామ్ వీరన్న, మాజీ సర్పంచ్ వజ్జ వీరభద్రం, పూణెం కుమార్, ఇర్ప కృష్ణ తదితరులు పాల్గొన్నారు.