Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం వాసవినగర్ గిరిజన భవన్లో టీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు సంక్షేమ పథకాలను గడప గడపకు తీసెకెళ్లాలన్నారు. సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. విమర్శలకు తావు లేకుండా కార్యాచరణ ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుండి నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నరన్నారు. వరద బాధిత కుటుంబాలందరికి ప్రభుత్వం సహాయం అందించిందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు జీఓ నంబర్ 140 విడుదల చేసిందన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఏడు మండలాల మొదటివిడత దళితబంధు లబ్దిదారులతో సమావేశం నిర్వహించారు. దళితబంధు పథకాన్ని ఉపయోగించుకోని భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మార్కేట్ కమిటీ చైర్మెన్లు, మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికసంఖ్యలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.