Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలపట్ల మరింత బాధ్యత పెరిగింది
- అభినందన సభలో కూనంనేని
నవతెలంగాణ-పాల్వంచ
జనహితం కోసం పనిచేసేది కమ్యూనిస్టు పార్టీలేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తరువాత తొలిసారిగా పాల్వంచకు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు, కుల సంఘాలు, అసోసియేషన్ ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీతో సభ ప్రాంగణం దగ్గరికి చేరుకున్నారు. సీపీఐ పాల్వంచ పట్టణ, మండల సమితిల ఆధ్వర్యంలో స్థానిక లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ప్రజలపట్ల, వారి సమస్యలపట్ల మరింత బాధ్యత పెరిగిందని ఆ బాధ్యతను ఎన్ని కష్టాలు ఎదురైనా నిర్వర్తిస్తానని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐకి ప్రజాధరణ కొదవలేదన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, సర్వ మతాల పెద్దలు, ప్రజా కార్మిక సంఘాల, రాష్ట్ర, జిల్లా నాయకులు ఈ అభినందన సభకు హాజరై కూనంనేని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి దుర్గా రవికుమార్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు విశ్వనాథం, బందెల నరసయ్య, నరాటి ప్రసాద్, వై.శ్రీనివాస్ రెడ్డి, డి.వెంకన్న, పాల్వంచ పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబు, మండల కార్యదర్శి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.