Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్ జనమంచి
నవతెలంగాణ-ఇల్లందు
చిన్న చూపు చూడకుండా చెవిటి, మూగ వారిని గౌరవించడం మన బాధ్యతని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్ జనమంచి అన్నారు. 26న జరగనున్న ప్రపంచ చెవిటి, మూగ వ్యాధిగ్రస్తుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మండలంలోని రొంపేడు గ్రామ పంచాయతీ పరిధిలోగల ప్రభుత్వ దవాఖానను ఆయన సందర్శించి, మాట్లాడారు. అదేవిదంగా వైద్యశాలలో ఉన్న పరికరాలు,వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మహేష్, జనరల్ సెక్రటరీ రవికుమార్ నాయక్, సీనియర్ న్యాయవాది దంతాల ఆనంద్, వైద్యాధికారి కార్తిక్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.