Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గు లారీలను అడ్డుకున్న కార్మికులు
- మొండిగా వ్యవహరిస్తే....పోరాటం ఉధృతం చేస్తాం : జేఏసీ
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని, మొండిగా వ్యవహరించితే పోరాటం ఉధృతం చేస్తామని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం బైపాస్ రోడ్డు వద్ద బొగ్గు లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలను పెంచాలని, ఫిబ్రవరి 9న ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర సమస్యల పరిష్కారానికి గత 17 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నప్పుడు సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడను తీవ్రంగా నిరసించారు. జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు బైపాస్‌లోని కారుకొండ రామవరం వద్ద బొగ్గు లారీలను నిలిపివేసి ఆందోళన చేశారు. భారీగా బొగ్గు లారీలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినది. సింగరేణి యాజమాన్యం సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని, తక్షణమే వేతనాలు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యమాన్ని జేఏసీ ఆధ్వర్యంలో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపద్యంలో పోలీసులుకు జేఏసీ నాయకులుకు మధ్య కొద్దిసేపు వాదన చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గుత్తుల సత్య నారాయణ, యర్రగాని కృష్ణయ్య, పి.సతీష్, కాలం నాగభూ షణం, ఇనపనూరి నాగేశ్వరరావు, కందగట్ల సురేందర్, ఏ.ప్రభాకర్, కిషోర్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
జీతాలు పెంచేందుకు యాజమాన్యం ముందుకు రావాలి : జేఏసీ
ఇల్లందు : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలను పెంచాలని ఫిబ్రవరి 9న ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర సమస్యల పరిష్కారానికి చేస్తున్న నిరవధిక సమ్మె ఆదివారానికి 17 రోజులకు చేరుకున్నది. సమస్యలు పరిష్కరించకుండా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ఎస్సార్ ఎల్టీ గ్యారేజ్ మహబూబాబాద్ రోడ్ చెక్‌పోస్ట్ వద్ద బొగ్గు లారీలను నిలిపివేసి ఆందోళన చేశారు. బొగ్గులారీలు నిలిచిపోవడంతో అంతరాయం ఏర్పడినది. ఈ నేపద్యంలో స్థానిక పోలీసులుకు, ఓసీ ఏజెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అంజిరెడ్డి జేఏసీ నాయకులకు మధ్య కొద్దిసేపు వాదన జరిగినది. అనంతరం పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేశారు. అనంతరం బతుకమ్మ ఆడి నిరసన తెలియజేశారు. సందర్భంగా జేఏసీ నాయకులు తాళ్లూరి కృష్ణ, షేక్ యాకుబ్ షావలి, దేవర కొండశంకర్, బంధంనాగయ్య, రాసుద్దీన్, కే.సారంగపాణి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కాంట్రాక్టు కార్మికుల అర్దనగ ప్రదర్శన
మణుగూరు : కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం కూనవరం రైల్వే గేట్ వద్ద కాంట్రాక్టు కార్మికులు అర్దనగ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి, మాట్లాడారు. రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న యన్నారు. కొద్దిపాటి జీతాలతో కాంట్రాక్ట్ కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. నేడు డీఎల్సీ సమక్షంలో సింగరేణి యాజమాన్యానికి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీకి మధ్య జరుగు చర్చలు సఫలం కావాలని ఆయన ఆకాంక్షించారు. సింగరేణి ప్రైవేట్ వైద్య సిబ్బంది సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు, గద్దల శ్రీనివాసరావు, అక్కి నరసింహారావు, గౌని నాగేశ్వరరావు, ఎండి గౌస్, పొదిల వీరభద్రం, అంగోత్ మంగీలాల్, ఉప్పు తల నరసింహారావు, ఎస్ఎంఎస్ ప్లాంట్ కృష్ణయ్య, వైద్య సిబ్బంది సాగర్, శంకర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.