Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
మండల పరిధిలోని లాలాపురం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) నాయుకురాలు శతాధిక వృద్ధ్దురాలు సంక్రాంతి వెంకమ్మ ఇటీవలే మరణించిన విషయం విధితమే. ఈ సందర్భంగా ఆదివారం కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన దశదిన కర్మ కార్యక్రమానికి పలు పార్టీల నాయకులు భారీగా హాజరై వెంకమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, డీసిసిబి చైర్మన్ కూరుకూల నాగభూషణం, తుమ్మల యుగేందర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్య వీరభద్రం, బొంతు రాంబాబు, మాదినేని రమేష్, తాళ్లపల్లి క్రిష్ణ, కొప్పుల క్రిష్ణయ్య, సీనియర్ నాయకులు సంక్రాంతి మధుసూధన్ రావు, చింతనిప్పు చలపతిరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, టీపిసిసి కమిటీ సభ్యులు సూరంపల్లి రామారావు, కార్పొరేటర్లు చావా నారాయణ రావు, వలరాజు పోట్ల విరేందర్, సరిపూడి సతీష్, సైదులు, రావూరి సైదుబాబు, రాష్ట్ర మార్కుఫైడ్ వైస్ చైర్మన్ బోర్రా రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు బాలాజీ, కౌన్సిలర్ ధనేకుల వేణు, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ముళ్లపాటి సీతారాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దొండపాటి రమేష్, సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి, కొనకంచి ప్రసాద్, మాజీ సర్పంచ్ సంక్రాంతి చంద్రశేఖర్, ఆమె కూమారులు సంక్రాంతి పుల్లయ్య, నర్సయ్య వెంకటనర్సయ్య, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.