Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
పీసీసీ సభ్యులుగా నియమితు లైన జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రాన్ని ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా, నగర, మండల ఓబీసీ సెల్ నాయకు లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ.. కష్టపడి పని చేస్తే ఫలితం తప్పకుండా అనుభవించి తీరుతామని అన్నారు. జిల్లా ఓబిసి సెల్ అధ్యక్షుడిగా వీరభద్రం చేస్తున్న సేవలు అభినందనీయమని, కష్టపడి పని చేసే వారికి పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు టిపిసిసి అన్ని సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యతనిస్తూ ఆయా నియోజకవర్గాల్లో పీసీసీ డెలిగేట్లుగా నియమించారని తెలిపారు. పార్టీ సలహాలను సూచనలను పాటిస్తూ వీరభద్రం మరిన్ని పదవులు ఆశించాలని ఆకాంక్షించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్రంలోని రెండో స్థానంలో ఖమ్మం జిల్లా ఉందని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ కార్యకర్తకు అభిందనలు తెలిపారు. పుచ్చకాయల వీరభద్రం మాట్లాడుతూ... తనపై ఎంతో నమ్మకం ఉంచి పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించి ఖమ్మం నియోజకవర్గ పిసిసి డెలిగేట్ గా నియమించినందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, పార్టీ సూచించిన విధానాలను కచ్చితంగా పాటిస్తానని అన్నారు. ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గానికి ఒక స్థానం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర బీసీ సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, సభాధ్యక్షుల పర్లపాటి కృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, పల్లె బోయిన భారతి చంద్రం, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు ఎర్రం బాలగంగాధర తిలక్, వైరా నియోజకవర్గం నుంచి పీసీసీ సభ్యులుగా నియమితులైన వడ్డే నారాయణరావు, గంగరాజు యాదవ్, జిల్లా ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు గజ్జల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.