Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ-ముదిగొండ
సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలచేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గభవాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ 9వ మహాసభ ముదిగొండలో ఆదివారం జరిగింది. ఈ మహాసభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 2004లో అప్పటి బిజెపి ప్రభుత్వం సిపిఎస్ ను ప్రవేశపెడితే ఆతర్వాత కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ ప్రభుత్వాలు కొనసాగించి ఉద్యోగులలో తీవ నిరాశను పెంచేయని ఆమె విమర్శించారు. సిపిఎస్ విధానం పట్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. ఈ వ్యతిరేకతను గమనించిన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ ను రద్దు చేశాయని ఆమె గుర్తు చేశారు. ఉద్యోగుల సామాజిక భద్రత ముంపుగా మారిన చందాతో కూడిన పింఛన్ పథకం (సిపిఎస్) దేశవ్యాప్తంగా ఉద్యోగులకు గుదిబండగా మారిందన్నారు. రాష్ట్రంలో విద్యారంగం తీవ్రసంక్షోభంలో ఉందన్నారు. ఏజెన్సీ అలవెన్సులు, పిఆర్సిను పెంచుతూ జీవో విడుదల చేయాలన్నారు. ఈ మహాసభల్లో యుటిఎఫ్ రాష్ట్ర నేత రవి, జిల్లా అధ్యక్ష కార్యదర్శ జివి నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న, జిల్లా కార్యదర్శి పి సురేష్, ఎస్కె రంజాన్, వి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.