Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బతుకమ్మ పండుగ సంబరాలు నగర మేయర్ పునుకొల్లు నీరజ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మొదటిరోజుగా ఎంగిలిపూల బతుకమ్మను (22 అడుగుల) కార్పొరేషన్ కార్యాలయం నందు నిర్వహించారు. ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ తాత మధు సూదన్ రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, జేసీ మధుసూదన్ రావు సంబురాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ నీరజ మాట్లాడుతూ... ప్రపంచ మొత్తంలో పూలను పూజించే అతి పెద్ద పండుగ జరుపుకునే రాష్ట్రం తెలంగాణ అన్నారు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు బతుకమ్మకు పెద్దగా గుర్తింపు ఉండేది కాదన్నారు.
మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆదేశాల మేరకు బతుకమ్మ వేడుకలు శివాలయం సెంటర్, నయాబజార్ స్కూల్, రోటరీ నగర్, వీడియోస్ కాలనీ సాయి బాబా టెంపుల్, చెరువు బజార్, జమ్మిబండ, కనక పరమేశ్వరి టెంపుల్ లో మహిళలందరూ కలిసి ఈ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు, అర్బన్ తహసీల్దార్ శైలజ, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, ట్రాఫిక్ సీఐ అంజలి, స్థానిక కార్పొరేటర్ శ్రీ విద్య, ఉద్యోగస్తులకు అదేవిధంగా టీఎన్జీవోస్ మహిళామణులకు కె.ఎం.సి ఉద్యోగ మహిళలకు, అదేవిధంగా 53వ డివిజన్ మహిళా మండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.