Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయటకు తీయడానికి పడరాని పాట్లు
నవతెలంగాణ-కామేపల్లి
మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన రైతుల పంట పొలాల్లో ట్రాన్స్ఫారం కాలిపోయాయి మూడు రోజులు అయింది. ఇది బురద పొలంలో ఉండడంతో దాన్ని బయటికి తీయడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ట్రాన్స్ఫారం అదే స్థలంలో పెట్టగలం కానీ కొత్త ప్లేస్ లో పెట్టడానికి సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్టిమేషన్ వేసి తర్వాత ఎంత ఖర్చు వస్తుందో అంత ఖర్చు మేమే సొంతంగా పెట్టుకుంటాము మాకు దానికి సంబంధించిన మెటీరియల్ ఇచ్చి బురద లేని స్థలంలో పెట్టాలని కోరుతున్నారు. అయినా అధికారులు ససేమిరా అంటున్నారని తెలిపారు. కాలిపోయిన ట్రాన్స్ఫారంని ఆ బురదలో నుంచి బయటకు తీయటానికి ట్రాక్టర్ కి 5000 ట్రాక్టర్ దిగబడిన తర్వాత బయటికి తీయడానికి 25 వేలు ప్లొక్లేన్ కి మొత్తం 30 వేలు ఖర్చు రైతులు పెట్టుకున్నామని లబోదిబోమంటున్నారు. పంట పొలాలు నీళ్ళు లేక ఎండిపోతున్నాయని అన్నారు.