Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్లెమెంట్
నవతెలంగాణ- సత్తుపల్లి
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దేశ సంపదను అమ్మే పనిలో ప్రధాని మోదీ నిమగ మయ్యారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బీజీ క్లెమెంట్ విమర్శించారు. స్థానిక మదర్ థెరెస్సా టెక్నో స్కూలులో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ మండల మహాసభలో క్లెమెంట్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వరంగ సంస్థలైన ఆయిల్, బీఎస్ఎన్ఎల్, బ్యాంకులు, ఎల్ఐసీ, నౌక, విమనాశ్రయాలను పూర్తిగా ప్రయివేట్రంగ సంస్థలకు అమ్మేశారన్నారు. సభ ప్రారంభానికి ముందు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గాదె లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించారు. మహాదేవ లక్ష్మీ, కర్నాటి బసవయ్యల అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఏఐటీయూసీ, అనుబంధ సంఘాల నాయకులు సంఘ జిల్లా కార్యదర్శి తోట రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు నిమ్మటూరి రామకృష్ణ, జిల్లా నాయకులు తడికమళ్ల యేబు, నజీముద్దిన్, రఫీ పాల్గొన్నారు.