Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు
నవతెలంగాణ-కొణిజర్ల
దళిత బంధు పథకాన్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శవర్గ సభ్యులు బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి క్రిష్ణలు ప్రభుత్వాన్ని అధికారులను విజ్ఞప్తి చేసారు. మండల పరిధిలోని లాలాపురం గ్రామంలో ఆదివారం మండల స్థాయి విస్తృత సమావేశం రోషన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితబంధు పథకం ఎమ్మెల్యే అనుచరులు ప్రజాప్రతినిధులకు దళితుల్లో ఆర్థికంగా బలంగా ఉన్నా వారికే ఇస్తున్నారని దీంతో గ్రామాల్లో అసలైన పేద దళితులకు అందడం లేదన్నారు. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు పథకాన్ని వర్తింపచేయడం వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. అదేవిధం గా డిసెంబర్ నెలలో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరగబోయే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహసభలను విజయ వంతం చేయాలని కోరారు. మహసభలు విజయవంతం కోసం నాయకులు కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని సూచించారు. ముందుగా సంక్రాంతి వెంకమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొప్పుల క్రిష్ణయ్య, మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబ రావు, మండల కమిటీ సభ్యులు వడ్లమూడి నాగేశ్వరరావు, మంగా చెన్నారావు, జోనెబోయిన అంజయ్య, కావూరి సత్యం, హరిచంద్, అజరు కూమార్, గోపయ్య, మాధవరెడ్డి, కాటయ్య, బోడ్డుపల్లి వీరభద్రం, రాంచందర్ రావు, గాదె వెంకటరెడ్డి పాల్గొన్నారు.